చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న చత్తీస్ ఘఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చికుర్బట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మృతి చెందారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ఆ ప్రాంతంలో భద్రతాబలగాలు గస్తీ కాస్తుండగా నక్సల్స్ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఆరుగురు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa