మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పై ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు ఫైరయ్యారు. ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ప్రజలను అవహేళన చేస్తే సహించేది లేదని ఘాటుగాహెచ్చరించారు. జీవీఎంసీ 50వ వార్డు పరిధి మాధవధార వద్ద వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్యాలయాన్ని బుధవారం కెకె రాజు ప్రారంభించారు. కనీస అవగాహన లేకుండా విమర్శించడం సిగ్గు చేటని అన్నారు.