కొరిసపాడు మండలంలో బుధవారం పదోవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. చివరి రోజున విద్యార్థులు ఉత్సాహంతో పరీక్షకు హాజరయ్యారు. మండలంలో మూడు సెంటర్లలో 461 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పబ్లిక్ పరీక్షల నుంచి విద్యార్థులకు ఉపశమనం కలగడంతో విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చారు. తల్లిదండ్రుల వద్ద తమ సంతోషాన్ని వెల్లబుచ్చారు.