ఏపీలోని అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి పది ఎమ్మెల్యే, ఆరు ఎంపీ సీట్లు దక్కాయి. ఎంపీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. బుధవారం సాయంత్రం పది అసెంబ్లీ సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. ఊహించిన విధంగానే కొంతమంది నేతలకు సీట్లు దక్కగా.. మరికొంతమందికి మాత్రం అనూహ్యంగా స్థానం దక్కింది.మరోవైపు సీనియర్ బీజేపీ నేతలకు ఈసారి నిరాశ ఎదురైంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి నేతలకు అవకాశం దక్కలేదు. యువ మోర్చా జాతీయ కార్యదర్శి సురేష్ కు నిరాశే ఎదురైంది. టీడీపీ నేత బొజ్జ రోషన్.. బిజెపిలో చేరకుండానే బద్వేల్ టికెట్ దక్కించుకున్నారు.
మరోవైపు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన అనపర్తి.. ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. పొత్తులో భాగంగా అనపర్తి సీటుకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. అక్కడి నుంచి శివకృష్ణరాజు పోటీ చేయనున్నారు. గతంలో ఈ సీటుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాజాగా బీజేపీ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. అలాగే జనసేన నేత పోతిన మహేష్ ఆశించిన విజయవాడ పశ్చిమ టికెట్ సైతం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. అక్కడి నుంచి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేయనున్నారు. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ దక్కింది. ఇక మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సైతం ఈసారి కైకలూరు నుంచి పోటీచేయనున్నారు.
బీజేపీ ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే
జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి
ఎచ్చర్ల - ఎన్. ఈశ్వరరావు
ఆదోని - పీవీ పార్థసారథి
విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి
అరకు- పంగి రాజారావు
విశాఖపట్నం నార్త్ - విష్ణు కుమార్ రాజు
ధర్మవరం - సత్యకుమార్
అనపర్తి- శివకృష్ణ రాజు
కైకలూరు - కామినేని శ్రీనివాసరావు
బద్వేలు - బొజ్జ రోషన్