ఎర్రగుంట్లలో జనంతో సీఎం జగన్ ముఖాముఖి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు భూమా అఖిల ప్రియ వచ్చారు. ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతులపై ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చేయి ఎత్తారని భూమా అఖిల ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో భూమా అఖిల ప్రియని అరెస్ట్ చేసి,శిరివెళ్ల స్టేషన్కు పోలీసులు తరలించే యత్నం చేశారు. పోలీసుల వాహనం ఎక్కేందుకు భూమా అఖిలప్రియ నిరాకరించారు. శిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు నడుస్తూ వస్తానంటూ స్టేషన్కు అఖిల ప్రియ బయలుదేరారు.