వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి పిటిషన్‌పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సీబీఐ-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్‌ని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కొందరు తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ నాంపల్లి కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశాడు. తన తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని పోలీస్ రిపోర్టు ఇచ్చినా స్వీకరించడం లేదంటూ దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దస్తగిరి తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీబీఐ అధికారులను నాంపల్లి కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తండ్రి హాజీపీరాపై గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది రోజుల క్రితం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే దస్తగిరి తన కుటుంబాన్ని కాపాడాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.