శ్రీశైలంలోని స్వామి వారి సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల అభిషేకాలు, కుంకుమార్చన పూజలు గురువారం నుంచే నిలిపివేశారు. శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ సేవా టికెట్ల జారిని నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa