చెన్నైలోని రద్దీగా ఉండే అల్వార్పేట ప్రాంతంలోని చామియర్స్ రోడ్డులో గురువారం సాయంత్రం ప్రసిద్ధ సెఖ్మెట్ బార్ పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పైకప్పు కూలిపోవడానికి గల కారణాలపై స్పష్టతలేవు అని తెలిపారు."ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారిని కార్మికులుగా గుర్తించారు. మరెవరైనా చిక్కుకుపోయారేమోనని రెస్క్యూ టీమ్లు పనిచేస్తున్నాయి" అని రాష్ట్ర అగ్నిమాపక సేవల చీఫ్ అబాష్ కుమార్ ఎన్డిటివి కోట్ చేసినట్లు చెప్పారు. మరోవైపు పైకప్పు కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయమై స్థానిక పోలీసు శాఖ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.