కాణిపాకంలో గురువారం రాత్రి స్వర్ణ రథంపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లు ఊరేగారు. ఉదయం సంకటహర గణపతి వ్రతాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరిగిన ఈ వ్రతంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమి గడచిన నాలుగవ రోజున ఈ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించి, సంకటహర గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే రాత్రి ఉత్సవర్లను స్వర్ణ రథంలో ఉంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.