ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నవాబుపేట కు చెందిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు గురువారం గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు.