ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామంలో గురువారం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే మరియు ఏపీఐఐసీ చైర్మెన్ జంకె వెంకటరెడ్డి వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి సొంత ఇంటి కలలను నిజం చేసిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు.