ప్రతి నెల కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న విషయం తెలిసిందే.. మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే..
1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి.
ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.. లేకుంటే తీవ్రంగా నష్టపోతారని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఎస్బిఐ క్రెడిట్ కార్డు..
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలెర్ట్.. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి.. ఈ క్రెడిట్ కార్డును వాడి అద్దె చెల్లింపులు చేస్తే ఎటువంటి రివార్డు పాయింట్లు యాడ్ అవ్వవని చెబుతున్నారు.
LPG గ్యాస్ ధర..
LPG సిలిండర్ గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024న మారనున్నాయి.. ఇప్పటివరకు స్వల్పంగా పెరిగిన ధరల్లో మార్పులు వచ్చాయి.. ఇకమీదట భారీగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
ఫాస్టాగ్ KYC అప్‌డేట్..
ఫాస్టాగ్‌కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతున్నాయి.. మార్చి 31 వరకు ధరలతో పాటు అప్డేట్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాలని నిపుణులు చెబుతున్నారు..
పాన్ -ఆధార్ లింక్..
మీరు పాన్ కార్డును, ఆధార్ కార్డు తో లింక్ చెయ్యలేదా.. అయితే ఈ రెండు రోజుల్లో పూర్తి చెయ్యండి.. లేకుంటే ఆ కార్డులు పనిచెయ్యవు..పాన్ కార్డు పనిచేయదు.. ఏప్రిల్ 1 తర్వాత అప్డేట్ చెయ్యాలంటే మాత్రం 1000 రూపాయలు చెల్లించాలి..
కొత్త పన్ను చెల్లింపులు..
పన్ను చెల్లింపుల విషయంలో కూడా మార్పులు రాబోతున్నాయి..కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్‌గా పన్ను చెల్లించాల్సి వస్తుంది… ఇంకా ఎన్నో రూల్స్ మార్పులు వస్తాయి.. ఈపిఎఫ్ఓ లో కూడా మార్పులు రానున్నయని తెలుస్తుంది..