నేడు ప్రపంచ ఇడ్లీ డే సందర్భంగా ఐపీఎల్ క్రేజ్‌ను ఇడ్లీ మార్కెటింగ్‌కు ఉపయోగించుకున్న చెన్నైలోని ఓ హోటల్‌పై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇడ్లీ ప్రీమియర్ లీగ్ అంటూ స్పెషల్ ఆఫర్ ఉన్న ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. 'మార్కెటింగ్‌లో భారతీయుల సృజనాత్మకతకు హద్దు లేదు. ఈ ఐపీఎల్ ఆదివారం ఉదయం మంచి రేటింగ్ పొందింది. నేను కూడా ఇడ్లీ హోం డెలివరీ కోసం నా టికెట్ రిజర్వ్ చేసుకున్నా' అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa