ఏపీలో వచ్చేది ప్రజా ప్రభుత్వమే అని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక మైనింగ్ దోపిడీపైనే తొలి విచారణ జరుపుతామని వ్యాఖ్యానించారు.
ఐదేళ్లుగా జే-గ్యాంగ్ యథేచ్ఛగా దోపిడి చేస్తుందని ఆరోపించారు. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa