వేసవిలో చోరీలు జరగకుండా పురప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్సై పాపినాయుడు కోరారు. ఎలమంచిలీలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో ఆటోలో ప్రచారం చేయించారు. వేసవిలో ఇంటి తలుపులు తెరచి ఉంచి నిద్రపోవద్దన్నారు. ఇంటికి తాళం వేసి దూరప్రాంతాలకు వెళ్లేవారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. బంగారం మెరుగు పెడతామని వచ్చిన వారిని నమ్మవద్దన్నారు.