రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అన్నారు. దోసూరు పంచాయతీ నుండి 10మంది, మోటురుపాలెం నుంచి సుమారు 200మంది, చిప్పాడ పంచాయతీ నుండి సుమారు 50మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ పార్టీ కొండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
![]() |
![]() |