పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనన్న పాలన అందించారని జడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ గొంపా చినబాబు అన్నారు. బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలో బుధవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. గతంలో చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయకుండా ఇప్పుడు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ధర్మశ్రీ బూడి లను గెలిపించాలని కోరారు.