ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 6 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 01:03 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో  ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది సమీపిస్తుండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. వందల కిలొమీటర్ల పాదయాత్ర చేస్తూ నల్లమల అటవీ ప్రాంతం నుంచి వేలాదిగా కన్నడ భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం శివనమస్మరణతో మారుమోగుతోంది. కన్నడిగుల రాకతో శ్రీశైలంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. ఉగాది ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో చలువపందిళ్లు, తాగు నీటి వసతి, శౌచాలయాలు, విద్యుత్ దీపాలు, వైద్యశిబిరాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు దేవస్థానం అధికారులు ఇప్పటికే ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com