జగన్ ప్రభుత్వంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంపై నీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొన్ని చోట్ల వైసీపీ శ్రేణులు వృద్ధులను మంచాలపై తీసుకువస్తున్నారని అన్నారు. వారిని మంచాలపై తీసుకురమ్మని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దీనికి వైసీపీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఎన్ని శవరాజకీయాలు, విన్యాసాలు చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సచివాలయం ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారితో ఇళ్లవాద్దకు పెన్షన్లు పింపిణీ చేయవచ్చునని.. అలా ఎందుకు చేయడంలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.