మ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం అసెంబ్లీల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం ఈరోజు చంద్రబాబు బాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ప్రసంగాలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.