లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సైజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మైసూర్‌లోని చామరాజనగర్ నియోజకవర్గంలో ఓ గోడౌన్లో నిల్వ చేసిన రూ.100 కోట్ల విలువైన లిక్కర్ కేసులను గుర్తించారు. ఒకేచోట భారీగా మద్యం దొరకడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. వాటిని ఎవరు నిల్వ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.