తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దూరదర్శన్ అంటే వార్తలు .. వార్తలు అంటే శాంతి స్వరూప్ అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన ఆయన మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శాంతి స్వరూప్‌కి కన్నీటి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. శాంతి స్వరూప్ కుటుంబసభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం శాంతి స్వరూప్‌కి గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టావశాత్తు చికిత్స పొందుతూనే శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు.