తనను శాశ్వతంగా నియోజకవర్గం నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరంలోని కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే తన ఎంపీ సీటు పోతుందన్నారు. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారని రఘురామ వాపోయారు. కూటమి నెగ్గాలనుకున్నానని.. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాననన్నారు. తనకు వారు న్యాయం చేస్తారని విశ్వాసముందన్నారు. ఒకవేళ టికెట్ తెచ్చుకోగలిగితే తనను కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని రఘురామ కోరారు.