ఎన్డీఏ కూటమి నేతల సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ భేటీలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగింది. 7 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, నిర్వహణ, సామాజిక మాద్యమాల్లో ప్రచారం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ పార్లమెంట్ సమస్యలపై ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించుకుంటామని, 7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కానుకగా ఇస్తామన్నారు. విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిపై తిరగబడే పరిస్థితులు ఉన్నాయని, రాజధానిని నాశనం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు అంతా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళమేనని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా పెట్టి.. ఫేక్ పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 30 ఏళ్ళు వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కూటమి వల్లే సాధ్యమని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa