సీఎం వైయస్ జగన్ బస్సుయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాక కోసం ఊరూరా ప్రజలు రోడ్డు వద్ద భారీ సంఖ్యలో వేచిచూస్తున్నారు. సీఎం వైయస్ జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. ఎండను సైతం లెక్క చేయడం లేదు. కోవూరు క్రాస్ వద్దకు చేరుకున్న సీఎం వైయస్ జగన్‌ను బుల్లితెర నటుడు రియాజ్ కలిసి సంఘీభావం తెలిపారు.