విద్యుత్ షాక్ తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. మహానంది సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద అరటి తోటకు పెట్టిన విద్యుత్ వైరు తగిలి మృతి చెందినట్లు డిఆర్ఓ హైమావతి తెలిపారు. రేంజ్ ఆఫీసర్, వీఆర్వో సమక్షంలో పశువైద్యాధికారి పోస్టుమార్టం చేయించి దహనం చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.