విశాఖ నడిసంద్రంలో బోటు తగలబడిపోయిన సంఘటనపై అన్ని వర్గాలూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటనలో 9మంది మత్స్యకారులకు గాయాలు కాగా వారిని అధికారులు కేజీహెచ్‌కు తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు తదితరులు జాలర్లను పరామర్శించారు.