కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలంలోని అమగంపల్లె నుంచి బస్సుయాత్ర చేపట్టారు. వివేకా కూతురు డాక్టర్ సునీత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన ఎన.తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి విజయజ్యోతితో కలిసి బస్సుయాత్ర చేపట్టారు. తొలిరోజు బస్సుయాత్ర కాశినాయన మండలంలోని అమగంపల్లె నుంచి సావిశెట్టిపల్లె మీదుగా కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, బి.కోడూరు బద్వేలు, అట్లూరు మీదుగా సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..... దివంగత వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి అని ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నోఅద్భుతాలు చేశారన్నారు. ఇప్పుడు జగన సీఎంగా ఉన్నారు. బీజేపీకి రాషా్ట్రన్ని తాకట్టుపెట్టారన్నారు. ఒకప్పుడు వైఎస్, వివేకా జిల్లా ప్రధాన నాయకులని.. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండేవారన్నారు. ‘‘వైఎస్ వెళ్లిపోయారు. వివేకాను గొడ్డలితో క్రూరంగా చంపివేశారు. వివేకా చనిపోయి ఐదేళ్లు దాటింది. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు. న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిలని గెలిపించాలని సూచించారు.