వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో చేరారు. పల్నాడులో శనివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జంగాకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. "రాష్ట్రంలో సీఎం జగన్ పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే.. చంద్రబాబు వల్లే సాధ్యం. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు అని కృష్ణమూర్తి అన్నారు.