ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమలులో ఉన్నందున ఉపాధ్యాయుల విదేశీ ప్రయాణ అనుమతులను రద్దు చేశారు. ఈమేరకు ఒంగోలులో పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురే్‌షకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. అందుకు సంబంధించిన విధులకు ఉపాధ్యాయులను నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పటికే మే 13లోపు విదేశాలకు వెళ్లేందుకు ఇచ్చిన అనుమతులు, నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌వోసీ)లను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మళ్లీ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు, ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, హైస్కూలు హెచ్‌ఎంలు తమ పరిధిలో పనిచేస్తున్న వారు ఎవ్వరైనా ఎన్నికల విఽఽధులకు నియమితులై మే 13లోపు విదేశాలకు వెళ్లే వారు ఉంటే నిలిపివేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు నియమితులు కాని వారి విదేశీ ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు లేవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.