రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి దశ మారుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వారాహి విజయభేరి యాత్రంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.... యువతకు ఉపాధి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ మన ముందున్న సవాళ్లని, కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన పోరాడుతోందని, అధికారం కోసం కాదని పవన్ స్పష్టం చేశారు.