లీడర్‌కు, ప్రొవైడర్‌కు ఉన్న తేడా ప్రశాంత్ కిశోర్‌కు తెలియడం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్. చంద్రబాబు చేసేది మేనేజ్ మెంట్.. బ్రోకరిజం. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.