తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫైళ్ల దగ్ధంపై సీఐడీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై సిట్ కార్యాలయం వద్ద సీఐడీ వివరణ ఇచ్చింది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అని పేర్కొంది.