కృష్ణా జిల్లాలోని బందరు తాలుకా పోలీస్‌స్టేషన్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని, ఆయన అనుచురులు చేసిన హాంగామాపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైసీపీ శ్రేణులతో కలిసి బందరు తాలుకా ఎస్ఐ చాణిక్యపై పేర్నినాని ధర్నాకి దిగారు. దీనిపై చిలకలపూడి పీఎస్‌లో తాలుకా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్‌ను అతిక్రమించారని 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఉద్దేశ్వపూర్వకంగా పోలీస్ స్టేషన్ వద్ద గలాటా సృష్టించారని సెక్షన్ 143 కింద కేసు నమోదు అయ్యింది. సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు సెక్షన్ 427 కింద పేర్ని నాని మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ సానుభూతిపరులపై 50వ డివిజన్‌కు చెందిన వైసీపీ సానుభూతిపరులు దాడి చేశారు. దీంతో టీడీపీ ఫిర్యాదు మేరకు వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన పేర్నినాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలూకా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఆయన.. ఎస్‌ఐ చాణిక్యతో దురుసుగా ప్రవర్తించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ నిరసనకు దిగారు. టీడీపీకి ఎస్‌ఐ కొమ్ముకాస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa