ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కొత్తపల్లి పంచాయతీలోని కానపల్లిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి కానపల్లి గ్రామ ప్రజల నుండి అద్భుతమైన స్పందన, ఆదరణ, ప్రేమాభిమానాలు ఆయనకు లభించాయి. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడం, ఈ ఊరికి, ఈ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించడం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తాను సహాయపడిన విధానాన్ని వివరించి మే 13న జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మరొక్కసారి ఆశీర్వదించి, ఎంపీ అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి గారికి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa