అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారన్నారు అం జగన్ . హంతకులను కాపాడటానికా ప్రజలు అధికారం ఇచ్చిందంటూ కాంగ్రెస్ నేత షర్మిల ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తోందన్నారు. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డానని, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని.. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని ఆమె కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa