ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తన అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ హడావిడి చేస్తున్నారని, మద్యపాన నిషేధమని ని మోసం చేశారని ధ్వజమెత్తారు. ‘‘ మద్య నిషేధం అని చెప్పి జగన్ గారే లిక్కర్ అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా కల్తీ మద్యం. ఏపీలో కల్తీ మద్యం కారణంగా 25 శాతం అదనపు మరణాలు పెరిగాయి. అంతా భూమ్ భూమ్, డీఎస్సీ, క్యాపిటల్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లే కనిపిస్తున్నాయి. జగన్ హామీలు లిక్కర్ షాపులో నిలబడ్డాయి’’ అని మండిపడ్డారు. జమ్మలమడుగులో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.