టీడీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమగ్ర న్యాయం జరిగిందని టీడీపీ లీడర్ పంచుమర్తి అనురాధ అన్నారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు రూ.2లక్షల కోట్లు అందిచారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోహైటెక్ సిటీ నిర్మించి ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి 27రకాల సేవలు అందిస్తున్నారన్న అనురాధ మోడల్ స్కూలు నడుపుతూ 6వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారని కొనియాడారు. తమ అభిమాన నేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గుండెపోటుతో చనిపోవడం చూసి భువనేశ్వరి కలత చెందారని భావోద్వేగానికి గురయ్యారు.