ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో శనివారం అత్యధికంగా 39. 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహ దేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, చెన్నేకొత్తపల్లి 39. 8, తలుపుల 39. 6, పెద్దవడుగూరు 39. 5, పామిడి 39. 4, కనగానపల్లి 39. 2, యల్లనూరు, కణేకల్లు 39. 0, డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.