ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి ఘటనపై సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. జగన్‌కు తగిలిన రాయి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలి ఆయన కన్ను పోయే పరిస్థితి వచ్చిందని సజ్జల అన్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు.