విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా గాయపడ్డారు. దాడిపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తాము కావాలనే దాడి చేయించుకున్నామని అంటున్నారని, కావాలని దాడి చేయించుకుని కళ్లు పోగొట్టుకుంటామా? అని మండిపడ్డారు. ఈ సమయంలో తమకు టీడీపీ నేతల సానుభూతి అవసరం లేదని, వారు ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా ఉంటే చాలని అన్నారు. . సీఎం నుదుటిపై కాకుండా మరెక్కడైనా రాయి తగిలితే పరిస్థితి ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు.