సీఎం వైయస్ జగన్‌పై రాళ్ల దాడి దారుణమని.. ఈ ఘటనను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది కోల్డ్‌బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ ఎటాక్..సీఎం వైయస్ జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది. చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు. ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారు ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు. ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది. టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరు అంటూ సజ్జల మండిపడ్డారు.
![]() |
![]() |