సీఎం వైయస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి బాబుకి ఓటమి భయం పట్టుకుంది. వెన్నులో వణుకు పుట్టి హత్యాయత్నం చేశారు అని ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. ఆమె మాట్లాడుతూ..... ఇలాంటి హింసా రాజకీయాలు చేస్తే 2024 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి సమాధి కడతారు. మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కళ్లెర్రజేయండి.. సీఎం జగన్‌ను సమాధి చేసి, సీసం పోసి, కంకరేసి సమాధి కట్టండి.. అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. సీఎం జగన్ బస్సు యాత్రకు రాయలసీమ దాటాక ప్రజాదరణ తగ్గుతుందనుకున్నారు. దానికి మించి మరింతగా విజయవాడలో జనం రావడం చూశారు. రంగా హత్యకు ప్లాన్ చేసినట్టుగా అప్పటికప్పుడు ప్లాన్ చేశారు. దేవుడి ఆశీస్సులు, ప్రజా దీవెనలతో హత్యాయత్నం నుంచి సీఎం జగన్ బయటపడ్డారు అని తెలిపారు.
![]() |
![]() |