మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో జరిగేటప్పుడు ప్రజాబలం అంతగా ఉండదని చంద్రబాబు భావించారు. అయితే బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ.... ఎన్నో సభల్లో చంద్రబాబు.. సీఎం జగన్ బచ్చా.. అంతు చూస్తాం.. మసి చేస్తాం అన్నారు. లోకేశ్ అయితే ఎంత మందిని కొట్టి వస్తే.. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుని వస్తే అంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అన్నారు. వీటన్నిటినీ గమనిస్తే ఓ షార్ప్ షూటర్‌తో చేయించిన హత్యాయత్నం ఇదని అర్థమవుతోంది. అదే రాయి నుదిటిపైన, కంటిపై తగిలి ఉంటే పరిస్థితేంటి? అని ప్రశ్నించారు.