సీఎం వైఎస్ జగన్‌పై విజయవాడలో జరిగిన హత్యాయత్నం ఘటనపై ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి స్పందిస్తూ.... సీఎంకు అయిన లోతైన గాయాన్ని పరిశీలిస్తే చాలా పదునైన వస్తువుతోనే దాడిచేసినట్టు అర్థమవుతోంది. ఆ పదునైన వస్తువు కనుబొమ్మకు కొంత కింద తగిలి ఉంటే కంటిచూపు కోల్పోయేవారు. మరోవైపు పరిశీలిస్తే పుర్రె భాగంలో ఎంతో సున్నితమైన ప్రదేశాన్నే ఎంచుకుని ఈ దురాగతానికి పాల్పడినట్టు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో మెదడులోని మాటలను నియంత్రించే బ్రోకా ప్రదేశానికి బలమైన దెబ్బ తగిలినట్లైతే శాశ్వతంగా మాట కోల్పోయే ప్రమాదం ఉండేది. అదేవిధంగా కణతి, తల భాగంలో ఎక్కడ తగిలినా బ్రెయిన్ ఇంజ్యూరి అయి ప్రాణాపాయం సంభవించి ఉండేది. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో తలకు బలమైన గాయంతో బ్రెయిన్ డెడ్, కోమాలోకి వెళ్లడం వంటివి తరచు చూస్తుంటాం అని తెలిపారు.