రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలంలోని చుక్క వలస, కాపుశంభాం, కొండశంభాం తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పైల బలరాం, బలగం వెంకటరావు, ఎస్.సురేష్ కుమార్, బోడినాయుడు, కుమిలి శ్రీను, వెంపడాపు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెదుళ్లవలస గ్రామంలో సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వీరంతా ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకటరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.