తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానననేది రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని అది ఎంపీ గానా లేక ఎమ్మెల్యేగానా అనేది త్వరలో చెబుతానని నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరు రఘు రామకృష్ణరాజు అన్నారు. నామినేషన్ మాత్రం ఈనెల 22న వేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఉండి మండలం వెలివర్రు లోని వీర పేరంటాలమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ ప్రాంతానికి వచ్చినపుడు అమ్మ వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు సెంటిమెంట్ అన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రి కావాలని జగన్ ఓడిపోవాలని కోరుకున్నట్లు తెలి పారు. గతంలో తాను ఎంపీగా ఎన్నికైన తరువాత అమ్మవారి ఆల యానికి విచ్చేసి మొక్కలను నాటానని ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతుందన్నారు. సీఎం వస్తున్నా రంటే ఆ ప్రాంతంలో ఉన్న పచ్చని చెట్లను అధికారులు నిర్దాక్షి ణ్యంగా నరికేస్తున్నారని అన్నారు.