కూటమితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో వీరంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారిని నాగమాధవి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.