గూడవల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గన్నవరం నుంచి విజయవాడ వస్తున్న ఐచర్ వాహనంలో 190 కేజీల గంజాయి ఆదివారం పట్టుబడిందని పటమట సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. ఐరన్ లోడుతో వెళుతున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయిని గుర్తించామన్నారు. లారీని పట మట పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.