ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఇరు రాష్ట్రాల అధికా రులు సమన్వయంతో పనిచేయాలని బరం పురం సబ్ కలెక్టర్ దీనా దస్తగిర్ కోరారు. ఆదివారం బరంపురం కలెక్టరేట్‌లో ఇరు రాష్ట్రాల రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఇంటర్ స్టేట్‌కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీనా దస్తగిర్ మాట్లాడుతూ..... సరిహద్దు చెక్‌పోస్టులు వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని కోరారు.అక్రమ మద్యం, నగదు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల అదికారులు చర్చించారు. సమావేశంలో పలాస ఆర్డీవో భరత్ నాయక్, కాశీబుగ్గ డీఎస్పీ బి.నాగేశ్వరరెడ్డి, ఇచ్ఛాపురం ఎన్నికల రిటర్నింగ్ అదికారి సుదర్శన్ దొర, ఇచ్ఛాపురం, సోంపేట సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.